పూజా రామచంద్రన్ లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా, దోచేయ్, గంగ,కృష్ణార్జున యుద్ధం, త్రిపుర వంటి చిత్రాల్లో నటించి తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న పూజ.. ‘బిగ్ బాస్ 2’ తో ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఈమెకి ఫిట్ నెస్ పై ఏకాగ్రత ఎక్కువ. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఉదయం 6 గంటలకే లేచి వర్కౌట్లు వంటివి చేసేది. ఈమెది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె భర్త కూడా ఓ నటుడే.
అతను మరెవరో కాదు జాన్ కొక్కెన్. ఈయన సినిమాల్లో విలన్ గా, నెగిటివ్ రోల్స్ ప్లే చేస్తుంటాడు.‘సార్పట్ట’ సినిమాలో ఆర్యకు పోటీదారుడిగా నటించింది ఇతనే. పూజా, జాన్ లకు ముందుగా వేరే వాళ్ళతో పెళ్లి జరిగింది.విడాకులు తీసుకున్నాక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. పూజా బికినీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :