పెళ్లి వార్తలపై పూనం క్లారిటీ..!

  • June 18, 2016 / 12:18 PM IST

‘మొదటి సినిమా’తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన పూనం బజ్వా.. తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా కలిసి రాకపోవడంతో, ఆ తరువాత ఈ భామ కోలీవుడ్ వైపు వెళ్లింది. ఆ తరువాత కోలీవుడ్ లోనే స్థిర పడిన ఈ ముంబై బ్యూటీ.. మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. దర్శకుడు సునీల్ రెడ్డితో పూనం వివాహం త్వరలో జరగనుందని వార్తలు వినవచ్చాయి. ఈ వార్తలను ఖండించిన పూనం… తన సోదరి వివాహం అయిన తరువాతనే తాను పెళ్లి చేసుకుంటానని, తనకు ఇంకా పలు చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. ప్రస్తుతం పూనం బజ్వా.. తమిళంలో ముత్తిన కత్తిరికై , భోగి, మలయాళంలో కసబ చిత్రాల్లో నటిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తిక్క’ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus