ఈ మధ్యకాలంలో తన వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంది పూనమ్ కౌర్. ఆమె చివరిగా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. వెండితెరకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. దీంతో తన ట్వీట్స్ హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా పూనమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
విడాకులపై ఆమె స్పందిస్తూ.. సంచలన కామెంట్స్ చేసింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేయడంతో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. ”విడాకుల అనంతరం మగవారికి బాధ ఉండదా..? లేదంటే ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు.. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు.. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా..? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా..? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా..?’ అంటూ రాసుకొచ్చింది.
అయితే ఈ ట్వీట్ చేసి గంటలోనే ఆమె పోస్ట్ ను డిలీట్ చేసేసింది. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది..? ఎందుకు డిలీట్ చేసింది..? అనే విషయాలపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి విడాకుల అంశంపై ఆమె మాట్లాడిందంటే దానికి కారణం ఏంటా అని వెతికే పనిలో పడ్డారు.