Poonam Kaur: నెటిజన్ కి దిమ్మతిరిగే సమాధానం చెప్పిన పూనమ్ కౌర్!

ఇండస్ట్రీలో కొందరు సినిమా వార్తల కంటే సోషల్ మీడియా వార్తల ద్వారా ఎక్కువగా ఫేమస్ అవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ ఒకరు. ఈమె తెలుగు సినిమాలలో నటించింది కేవలం కొన్ని సినిమాలలో అయినప్పటికీ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా వార్తల్లో ఉండే పూనమ్ పేరు సోషల్ మీడియాలో కనపడితే వెంటనే నెటిజన్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకు వస్తారు.

ఇలా పవన్ కళ్యాణ్ పేరుతో పూనమ్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈమె ఎలాంటి ట్వీట్ చేసిన తప్పనిసరిగా ట్వీట్ చివరిలో #PK LOVE అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది పీకే అంటే అర్థం ఏంటి? పూనమ్ ఎందుకు ప్రతి ట్వీట్ చివర ఇలా పీకే అని పెడుతుంది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు సందేహాలను వ్యక్తపరిచారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తనకు కలిగిన ఈ సందేహాన్ని పూనమ్ ముందు ఉంచాడు. అక్క మీ ప్రతి ట్వీట్ చివర పీకే అని ఉంటుంది. పీకే అంటే అర్థం ఏంటి అక్క అని ప్రశ్నించాడు. ఇలా నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఏ కారణం లేకపోయినా మీరు నన్ను టీజ్ చేస్తూ ఉంటారు కదా? అయినా కూడా నేను ఇలాగే చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు అర్థమైందా తమ్ముడు అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus