Poonam Kaur: సమంత లాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్.. కేరళలో చికిత్స తీసుకుంటున్న నటి!

Advertisement

పూనమ్ కౌర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే హీరోయిన్గా పెద్దగా ఆదరణ సంపాదించుకోకపోయినా పలు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించారు. అయినా పూనమ్ కౌర్ సినిమాలలో నటించి పేరు సంపాదించుకోవడం కన్నా సోషల్ మీడియా ద్వారా వివాదాలలో నిలుస్తూ పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.

అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈమె గత కొత్త కాలం నుంచి అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ వ్యాధి కారణంగా త్వరగా అలసిపోవడం, నీరసించి పోవడం, నిద్రలేక బాధపడటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక ఇబ్బందులు తలెత్తడమే కాకుండా తీవ్రమైన కండరాల నొప్పులు ఉంటాయని తెలియజేశారు.

గత రెండు సంవత్సరాలుగా ఈమె ఈ వ్యాధితో బాధపడుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈమె కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం సమంత కూడా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాధి లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయని సమంత వెల్లడించారు. ఈ క్రమంలోనే సమంత లాగే పూనమ్ కూడా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news