బాలీవుడ్ నటి పూనమ్ పాండే సెన్సేషనల్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అందరి దృష్టి తనవైపు తిప్పుకోవడానికే అలా చేస్తుంటానని ఇటీవల మీడియా ముఖంగా వెల్లడించింది. సామ్ బాంబేను పెళ్లాడిన ఆమె వైవాహిక జీవితానికి మధ్యలోనే ఫుల్ స్టాప్ పడింది. గొడవలు, కొట్లాటలతో పోలీస్ స్టేష వరకు వెళ్లిన ఈ జంట చివరికి విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరమయ్యారు. ప్రస్తుతం పూనమ్.. కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘లాకప్’ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను పంచుకుంది. నాలుగు అంతస్తులు ఉండే తన ఇంట్లో ప్రైవేట్ గార్డెన్, టెర్రస్ ఇలా అన్నీ ఉండేవని.. ఎప్పుడైనా ఒంటరిగా నేచర్ ని ఆస్వాదించడానికి వెళ్లినా.. అతడు ఒప్పుకునేవాడు కాదని.. తనతోనే ఉండమని ఫోర్స్ చేసేవాడని చెప్పుకొచ్చింది. కనీసం ఫోన్ కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదని.. తనను బాగా హింసించేవాడని.. మందు తాగడం వంటివి అసలు నచ్చేవి కాదని బాధపడింది పూనమ్. ఈ వ్యాఖ్యలపై సామ్ బాంబే తీవ్రంగా స్పందించాడు.
నాలుగేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. కానీ ఇప్పుడు పెదవి విప్పాల్సిన అవసరం వచ్చిందని అన్నాడు. నిజానికి తమ పెళ్లి మధురమైన అనుభూతి అని.. ఏ రిలేషన్ లోనైనా పది శాతం గొడవలు, మనస్పర్థలు ఉంటాయని.. కానీ అందరూ వాటినే ఫోకస్ చేస్తానని.. మా విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చాడు సామ్ బాంబే. పూనమ్ చెప్పేదంతా పనికిరానై చెత్త అని మండిపడ్డాడు. గృహహింస పేరుతో అమాయకులైన ఎంతోమంది మగాళ్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని..
మహిళ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. పోలీసులు వచ్చి ఆమె భర్తను తీసుకెళ్లి కస్టడీలో ఉంచుతున్నారని అన్నాడు. తనను కూడా అలానే ఇరవై సార్లు పోలీసులు తీసుకెళ్లారని.. కానీ ఏమీ చేయలేదని.. దాని బట్టి మీరే అర్ధం చేసుకోండని అన్నారు. హనీమూన్ కి వెళ్లినప్పుడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసిందని.. హనీమూన్లో ఉన్నప్పుడు భర్త అత్యాచారం చేశాడని ఎలా అంటారో నాకైతే అర్థం కాదని మండిపడ్డాడు.