Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Advertisement

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం'(Maa Inti Bangaaram) సినిమా వాస్తవానికి గత నెలలోనే రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఈ జూన్ 19న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. రిలీజ్ కి సరిగ్గా వారం రోజుల టైమ్ కూడా లేదు. కానీ ఎటువంటి ప్రమోషనల్ హడావిడి కనిపించడం లేదు. అసలు ఈసారైనా ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Maa Inti Bangaaram

‘మా ఇంటి బంగారం’ అనేది తన సొంత బ్యానర్ అయిన ‘ట్రాలాల..’ లో సమంత చేసిన సినిమా. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మించింది. సమంత స్నేహితురాలు నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు.ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన టీజర్, ట్రైలర్..వంటివి ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. ‘బాషా స్టోరీలైన్ లో ‘ఫ్యామిలీ మెన్’ సమంతని చూసినట్టు ఉంది తప్ప కొత్తగా ఏమీ అనిపించలేదు’ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు.

పైగా దర్శకురాలు నందినీ రెడ్డి కూడా ఈ మధ్య ఫామ్లో లేకపోవడం మరింతగా మైనస్ అయ్యింది. ట్రైలర్ కట్ తో సినిమాకి మంచి ధియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది అని మేకర్స్ ఆశించారట. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో జూన్ 19న చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్లాక్ బస్టర్ మౌత్ టాక్ వస్తే తప్ప.. ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద నిలబడటం అనేది కష్టమే..!

ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus