ప్రముఖ ఛానెల్ యాంకర్ ఒకరు మరణించారు…అనుకోకుండా తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆమె సూసైడ్ చేసుకుందా….లేకపోతే ఎవరైనా మర్డర్ చేసి అలా వదిలేసి వెళ్ళారా అన్న అనుమానాలకు తావిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే…..ప్రముఖ తమిళ టీవీ నటి సబర్న అలియాస్ సుగుణ (29) శుక్రవారం మృతి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి…అయితే అదే క్రమంలో ఆమె మరణంపై అనేక అనుమానాలు సైతం వస్తున్నాయి..వివరాల్ళోకి వెళితే…తమిళ బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన సబర్న అంచెలంచెలుగా పైకి వచ్చింది..కొంత కాలంగా వెండి తెరపై కూడా చాన్సులు దక్కించుకుంది.
ఆమె తమిళనాడు రాజధాని చెన్నైలోని మధురవాయిలోని నివాసంలో విగతజీవిగా శుక్రవారం కనిపించింది. అయితే పోలీసులు చెబుతున్న కధనం ప్రకారం…మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసివేసి ఉండడంతో శుక్రవారం ఆ ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించగా….పోలీసులు రంగ ప్రవేశం చేసి అసలు విషయాలు లాగేందుకు పధకం రచిస్తున్నారు…అయితే అదే క్రమంలో సబర్న పడిఉన్న తీరు ని చూసి ఎవరో చంపేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు . పైగా సబర్న తలకు గాయం కావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది . అయితే రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్ విషయాల్లో చాలా సీరియస్‌గా ఉండే సబర్న ను ఎవరు చంపి ఉంటారు? ఎందుకు చంపి ఉంటారో త్వరలోనే పోలీసుల దర్యాప్తులో తెలిసిపోతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.