Posani, Pawan: పవన్ పై పోటీ గురించి పోసాని షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

ప్రముఖ టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే వైసీపీ అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారా అనే ప్రశ్నకు పోసాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై పోటీ చేసే ఆలోచన తనకు లేదని పవన్ పై పోటీ చేస్తే తనకు డిపాజిట్లు కూడా రావని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ పోసాని ఈ విషయాలు చెప్పుకొచ్చారు. పవన్ పై పోటీ చేస్తే నేను గెలవడం సాధ్యం కాదని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరని నేను సినిమా ఇండస్ట్రీలో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నని పోసాని అభిప్రాయపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే నేను సామాన్యుడినని ఆయన కామెంట్లు చేశారు.

ఇద్దరి మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటే నేను పవన్ కళ్యాణ్ కు పోటీగా ఎలా నిలబడగలనని పోసాని ప్రశ్నించారు. ఎలా ఆయనకు నాకు పోలిక ఎలా ఉంటుందని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ పై పోటీ చేస్తే చచ్చినా నేను గెలవలేనని నాకు డిపాజిట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే లేదని ఆయన చెప్పుకొచ్చారు. నేను పవన్ కళ్యాణ్ పై పోటీ చేయాలని భావించేంత అమాయకుడిని కూడా కాదని పోసాని పేర్కొన్నారు.

నేను అంత పిచ్చోడిని కూడా కాదని (Posani) పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అని ఆయన నూటికి నూరు శాతం గెలుస్తాడని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. పోసాని చేసిన కామెంట్లన్నీ అక్షర సత్యాలని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోసాని వాస్తవాలను గ్రహించి మాట్లాడుతున్నారని నెటిజన్లు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ పోసాని పోటీ చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus