Posani, Allu Arjun: బన్నీ గొప్పదనం చెప్పిన పోసాని కృష్ణమురళి.. ఏం చెప్పారంటే?

  • August 30, 2023 / 09:07 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఎంతోమంది తన వంతు సహాయం చేసినా ఆ సహాయాల గురించి ఇష్టపడరు. పుష్ప ది రైజ్ సినిమాకు నేషనల్ అవార్డ్ రావడంతో బన్నీ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీకి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసింది. సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బన్నీ ఒకరు కావడం గమనార్హం.

అయితే ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా బన్నీ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోసాని ప్రస్తుతం ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఏపీలో ఉన్న కళాకారులకు అండగా నిలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా చేయడం వల్ల బయటివాళ్లకు ఆర్టిస్టుల ఎంపిక సులువు అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.

ఏపీలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఐడీ కార్డులు ఇస్తామని ఒక్క రూపాయి కూడా కమీషన్ తీసుకోకుండానే ఈ కార్డులు ఇస్తామని పోసాని కామెంట్లు చేశారు. దర్శకుడు ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే కళాకారుల వివరాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిస్టులకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలనేది ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. బన్నీ చాలా మంచివాడని నన్ను ఎంతో అభిమానిస్తాడని పోసాని చెప్పుకొచ్చారు.

ఒకసారి బన్నీ నాకు రూ.5 లక్షలు ఇచ్చాడని మీరు డబ్బు వృథా చేయరు.. చాలామందికి గుండె ఆపరేషన్లు చేయించారు.. మీరు మంచి పనికి డబ్బులు వాడతారని రూ.5 లక్షలు ఇచ్చానని బన్నీ చెప్పాడని పోసాని కామెంట్లు చేశారు. చదువు ఆపేసిన ముగ్గురు విద్యార్థుల కోసం ఆ డబ్బులను ఖర్చు చేసి లైవ్ లో ఆ పిల్లలతో బన్నీకి థ్యాంక్స్ చెప్పించానని పోసాని తెలిపారు. పోసాని వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus