ఇదేగాని జరిగితే ఫ్యాన్స్ కు పండగే..!

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో ఇండియా వైడ్ పాపులర్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ‘కె.జి.ఎఫ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా వసూళ్ళను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో హీరో యశ్ ను ఎలివేట్ చేసిన తీరుకి అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయడానికి స్టార్ హీరోలు తెగ ఉత్సాహం చూపుతున్నారట. ఇక బడా నిర్మాతలు సైతం ప్రశాంత్ నీల్ తమ బ్యానర్లో ఓ సినిమా డైరెక్ట్ చేయాలని కోరుతున్నారట.

ఈ వరుసలో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ముందు ఉందట.ఇక దిల్ రాజు కూడా ఈ డైరెక్టర్ ను లైన్లో పెట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో హీరోగా ప్రభాస్ .. దిల్ రాజు బ్యానర్లో హీరోగా మహేష్ బాబు హీరోలుగా ఈ చిత్రాలని రూపొందించాలని ప్రయత్నిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్తని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఆరడుగుల అందగాళ్ళని ప్రశాంత్ డైరెక్ట్ చేస్తే రికార్డులు బద్దలవ్వడం ఖాయం అని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus