ప్రభాస్ కొత్త కారు!

  • July 30, 2016 / 10:57 AM IST

మ‌న టాలీవుడ్ హీరోల‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో పిచ్చి. చాలా మంది హీరోల‌కు కార్ల పిచ్చి ఉంటుంది. వాళ్ల‌కు అప్ప‌టికే రెండు మూడు కార్లు ఉన్నా…మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడ‌ల్ వచ్చిందంటే చాలు..వెంట‌నే ఆ కారుపై వారి క‌న్నుప‌డిపోతుంది. కోట్లు కొని మ‌రీ ఆ కారును కొనేసి త‌మ ఇంట్లో పెట్టేసుకుంటారు. ఆ కారును వాడినా వాడ‌క‌పోయినా కారు మాత్రం వాళ్ల ఇంట్లో ఉండాల్సిందే. ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, మ‌హేష్ ఈ హీరోలంద‌రూ ఈ కోవ‌లోకే వ‌స్తారు.

ఈ నేప‌థ్యంలోనే యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు కూడా కొత్త కారు కొన్నాడు. ప్ర‌భాస్ ఇప్ప‌టికే రెండు మూడు కార్లు వాడుతున్నా ఇప్పుడు కోట్లు పోసి మ‌రీ మ‌రో ఖ‌రీదైన కారు కొన్నాడు. ప్ర‌భాస్ రూ 2.82 కోట్ల‌తో కొత్త రేంజ్ రోవ‌ర్ కారును కొన్నాడు. ఈ కారు రిజిస్ర్టేష‌న్ కోసం ప్ర‌భాస్ ఖైర‌తాబాద్‌లోని ఆర్టీఏ కార్యాల‌యానికి వ‌చ్చాడు. ఆర్టీఏ కార్యాల‌యానికి వ‌చ్చిన ప్ర‌భాస్‌ను చూసేందుకు అభిమానులు ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. దీంతో అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus