Prabhas,Om Rawat: ఆదిపురుష్ టీజర్ లాంచ్ తర్వాత డైరెక్టర్ ను సీరియస్ గా రూమ్లోకి పిలిచిన ప్రభాస్!

  • October 4, 2022 / 12:33 PM IST

బాహుబలి(సిరీస్) తర్వాత ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ లభించింది.కానీ తన ఇమేజ్ ను కాపాడుకునే సినిమాలు అయితే ప్రభాస్ చేయడం లేదు అని స్పష్టమవుతుంది. సాహో, రాధే శ్యామ్ ఫలితాలు అందరికీ తెలిసినవే. సంక్రాంతికి రానున్న ఆదిపురుష్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. టీజర్ రిలీజ్ అయ్యేవరకు కొద్దో గొప్పో అంచనాలు ఉన్నా, టీజర్ చూసిన తర్వాత ఆ అంచనాలు కూడా తగ్గిపోయాయి అనే చెప్పాలి. టీజర్ పై ఇండియన్ లెవెల్లో ట్రోలింగ్ జరుగుతుంది.

టీజర్ లో గ్రాఫిక్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి అని ప్రేక్షకులు పెదవి విరిచారు.పైగా ఇది మోషన్ క్యాప్చర్ సినిమాలా ఏమాత్రం లేదు అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిన్న అయోధ్య లో సరయు నది తీరాన ఘనంగా జరిగింది. ఆదిపురుష్ టీమ్ అంతా అటెండ్ అయ్యారు. అయితే టీజర్ లాంచ్ కార్యక్రమం పూర్తయ్యాక ప్రభాస్ … దర్శకుడు ఓం రౌత్ పై సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు.

టీజర్ లాంచ్ పూర్తయ్యాక అక్కడ ఏర్పాటు చేసిన రూమ్ కు వెళ్తున్న ప్రభాస్.. ఒక్కసారిగా ఆగి.. ‘ ఓం అంటూ కోపంగా తన రూంలోకి రమ్మని పిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల మీమ్స్ చేస్తూ దీనిని ట్రెండింగ్ లో నిలుపుతున్నారు. ఆదిపురుష్ టీజర్ పెద్దగా బాగోకపోయినా అది యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus