Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

ఇటీవల హిందీలో రిలీజ్ అయ్యి ఘనవిజయం అందుకున్న చిత్రం ‘హనుమాన్ అంశ్'(Hanuman Ansh). కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆదారం చేసుకుని తీసిన సినిమా ఇది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత తెలుగులో రిలీజ్ అవుతుంది.

Hanuman Ansh

ఓ దశలో ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెలుగులో రిలీజ్ చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే తర్వాత ఆయన తప్పుకోవడంతో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 9న విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ 700 స్క్రీన్స్ లో ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎందుకో ఆశించిన స్థాయిలో ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు అని చెప్పాలి. కలెక్షన్స్ చాలా పూర్ గా నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

 డే1  1.0 cr
 డే2  0.95 cr
 డే3  1.25 cr
 టోటల్ గ్రాస్  3.2 cr
 టోటల్ షేర్  1.71 cr కోట్లు

‘హనుమాన్ అంశ్’ చిత్రం తెలుగు( తెలుగు రాష్ట్రాలు) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.7 కోట్లు. ఆల్మోస్ట్ అడ్వాన్సుల బేసిస్ పైనే విడుదల చేశారు. నష్టాలు వస్తే..   అయితే 3 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.71 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus