Prabhas Fan: కరెంట్ షాక్ తో ప్రభాస్ అభిమాని మృతి!

  • December 22, 2023 / 02:43 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ సినిమా ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు థియేటర్ వద్ద పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా సలార్ సినిమా సెలబ్రేషన్స్ లో అభిమానులు నిమగ్నమై ఉండగా ఒకచోట మాత్రం అపశృతి చోటుచేసుకుంది. సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతున్నటువంటి తరుణంలో విద్యుత్ ఘాతానికి గురై ప్రభాస్ అభిమాని మృతి చెందారు.

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో రంగా థియేటర్ వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. థియేటర్ వద్ద సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతున్నటువంటి తరుణంలో 29 సంవత్సరాల బాలరాజు అనే యువకుడు మృతి చెందారు. ఫ్లెక్సీ కడుతున్నటువంటి తరుణంలో ఫ్లెక్సీకి ఉన్నటువంటి ఇనుప కడ్డీ పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలకు తాకడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే బాలరాజు మృతి చెందారు.

ఇక ఈ ఘటనతో (Prabhas) ప్రభాస్ అభిమానులు అందరూ ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బాలరాజు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు తీగలు చాలా కిందకు ఉండటంతోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ సినిమా చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ అందుకోవడంతో థియేటర్ వద్ద అభిమానులు భారీ ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.

మరి కొన్ని చోట్ల అభిమానుల అత్యుత్సాహం కారణంగా థియేటర్ యాజమాన్యం కూడా షో రద్దు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల టికెట్లు దొరకకపోవడంతో కొంతమంది టికెట్లను ప్రింట్ తీసుకొని మరి వెళ్లి సినిమాని చూస్తుండడంతో థియేటర్లలో గొడవ చోటు చేసుకున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus