Kalki 2898 AD: కల్కి మూవీ ట్రైలర్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆ క్లారిటీ వచ్చేస్తుందా?

  • June 3, 2024 / 09:24 PM IST

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి (Kalki 2898 AD) సినిమా విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే విదేశాల్లో కల్కి మూవీ బుకింగ్స్ మొదలయ్యాయని సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా బుకింగ్స్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. టికెట్ రేట్ల పెంపు తర్వాతే ఏపీలో కల్కి మూవీ బుకింగ్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. కల్కి మూవీ 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. దీపికా పదుకొణే (Deepika Padukone) , దిశాపటాని (Disha Patani) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూ ఉండటంతో బాలీవుడ్ లో కూడా ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు కల్కి మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో ఈ సినిమా ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేయనుంది.

ఈ సినిమా 1000 కోట్ల బొమ్మో 2000 కోట్ల బొమ్మో తెలియాలంటే మాత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కల్కి 2898 ఏడీ సినిమా సైంటిఫిక్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇతర భాషల్లో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది.

కల్కి 2898 ఏడీ విడుదల తర్వాత సంచలనాలు సృష్టించడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ ప్రమోషన్స్ లో ప్రభాస్ కూడా పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. కల్కి సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus