Manamey Trailer Review: ‘మనమే’ ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!

  • June 1, 2024 / 04:26 PM IST

శర్వానంద్ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’ తో (Oke Oka Jeevitham) హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. అంతకు ముందు శర్వానంద్ చేసిన 5,6 సినిమాలు నిరాశపరిచాయి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత ఊహించని విధంగా శర్వానంద్ కెరీర్లో గ్యాప్ వచ్చింది. అతనికి పెళ్లవడం.. తర్వాత ఫ్యామిలీలో వరుసగా ఈవెంట్లు వంటివి జరగడం, అలాగే అతనికి పాప పుట్టడం.. ఇలా రకరకాల కారణాల వల్ల 2023 లో శర్వానంద్ సినిమా రాలేదు.

అయితే త్వరలో ‘మనమే’ (Manamey)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించారు. వివేక్ కూచిభొట్ల ( Vivek Kuchibitla ) సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, పాటలకి మంచి స్పందన లభించింది. తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు. 2 నిమిషాల 15 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమా ట్రైలర్లో అన్ని రకాల అంశాలు ఉన్నాయి.

కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎమోషన్,రొమాన్స్, యాక్షన్.. అన్నీ ట్రైలర్లో కనిపించాయి. శర్వానంద్ యాక్టింగ్ ‘రన్ రాజా రన్’ (Run Raja Run) నాటి రోజులు గుర్తుకొస్తాయి.హీరోయిన్ కృతి శెట్టి ( Krithi Shetty) చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఓ చిన్న పిల్లాడి రోల్ కూడా ఉంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొడుకే ఆ పాత్రని చేసినట్టు టీం వెల్లడించింది. విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus