Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం

  • June 1, 2024 / 04:10 PM IST

సినిమాకు ఉపయోగపడతాయి కదా అని.. ప్రచారంలోకి ఓ ఎలిమెంట్‌ను వాడుకుంటే ఎప్పుడో ఓసారి అదే తిరిగి ఇబ్బంది పెడుతుంది. సినిమాల విషయంలో ఈ సూత్రం చాలాసార్లు అన్వయించుకోవచ్చు. ఎందుకంటే సినిమాలు టీమ్‌లు, ప్రచార బృందాలు ఓ విషయం మీద బాగా ఆసక్తిచూపించి తెగ హైప్‌ ఇస్తే తిరిగి అవే కాటు వేసిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తొలి ఉదాహరణ సోషల్‌ మీడియా అయితే, రెండోది బుక్‌ మై షో రేటింగ్‌లు.

సోషల్‌ మీడియా ముఖ్యంగా ఎక్స్‌ (మాజీ ట్విటర్‌) గురించి మీకు తెలుసు కాబట్టి తర్వాత మాట్లాడదాం దాని గురించి. లేటెస్ట్‌ అండ్‌ హాటెస్ట్‌ టాపిక్‌.. అలాగే విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)  రీసెంట్‌గా రెయిజ్‌ చేసిన పాయింట్‌ ‘బుక్‌ మై షో’ గురించి మాట్లాడదాం. అన్ని జాగ్రత్తలు తీసుకుని రన్‌ చేస్తున్న ఎన్నికల్లోనే టాంపరింగ్‌ ఆరోపణలు, రిగ్గింగ్‌ జరుగుతున్న ఈ సమయంలో ఎవరు పడితే వారు ఓటేసే అవకాశం ఉన్నదానిని ఎలా నమ్ముతారు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) సినిమాను చూడకుండానే కొందరు రివ్యూలు ఇచ్చారని కథానాయకుడు విశ్వక్‌సేన్‌ ఇటీవల మాట్లాడారు.

సినిమా చూడకుండా ఉదయం 6 గంటలకే రివ్యూలు రాశారని అన్నారు. సినిమా సంగీతం బాగాలేదని రివ్యూల్లో రాశారని, వారు సినిమా చూడలేదని అక్కడే అర్థమైంది అని విశ్వక్‌ చెప్పాడు. అందుకే టికెట్‌ కొన్న వారికే ‘బుక్‌ మై షో’లో రేటింగ్‌ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరాడు. దీంతో ఈ వాదన విషయంలో నెటిజన్ల నుండి విశ్వక్‌కు మంచి స్పందనే వస్తోంది. అవును నిజమే, ఎవరు పడితే వాళ్లు ఇలా రాసేస్తే ఎలా అని అంటున్నారు.

అయితే టికెట్‌ కొన్నాక కూడా ఇలా తప్పుగా రాస్తే ఎలా? అప్పుడెలా ఆపుతారు అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో కొందరేమో అనవసరంగా బుక్‌ మై షో రేటింగ్‌ను హైలైట్‌ చేయడం వల్లే ఇప్పుడు ఇబ్బంది వస్తోంది అని అంటున్నారు. మరి ఈ విషయంలో సినిమా టీమ్‌లు, ప్రచార బృందాలు ఏమైనా ఆలోచిస్తాయేమో చూడాలి. అన్నట్లుగా టికెట్‌ కొన్నాకే ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేయాలని నెక్స్ట్‌ అడిగితే.. ఎలాన్‌ మస్క్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus