Pawan Kalyan: పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి సరిగ్గా 72 గంటల సమయం మాత్రమే ఉంది. పవన్ (Pawan Kalyan)  పిఠాపురంలో కచ్చితంగా గెలుస్తారని మెజారిటీ మాత్రమే తేలాల్సి ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ గెలిచి కూటమి అధికారంలోకి వస్తే మాత్రం పవన్ కు మంచి పదవి కూడా దక్కుతుందని అభిమానులు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఒక లేడీ ఫ్యాన్ చేసిన పని నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తూర్పు గోదావరిలోని ఉండ్రాజవరానికి చెందిన దుర్గా రామలక్ష్మి అనే పవన్ అభిమాని ఈ ఎన్నికల్లో పవన్ గెలవాలని కోరుతూ తిరుమలలో 450 మెట్లు మోకాళ్లపై ఎక్కారు.

పవన్ పై ఉన్న అభిమానంతో మాత్రమే తాను ఈ పని చేశానని పార్టీలతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆ మహిళ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ను లేడీ ఫ్యాన్స్ సైతం ఇంతలా అభిమానిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిఠాపురం ఎన్నికల ఫలితం విషయంలో పవన్ కళ్యాణ్ సైతం అస్సలు టెన్షన్ పడటం లేదని తెలుస్తోంది. వేర్వేరు అంశాలు పవన్ కు కలిసొచ్చాయని తెలుస్తోంది.

ఈ నియోజకవర్గంలో పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువగా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు నేతల్లో సైతం ఒకింత ఉత్కంఠను పెంచుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ జరుగుతుండగా ఆ ప్రశ్నలకు సమాధానాలు సైతం మరో మూడు రోజుల్లో తెలియనున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ఆరు గంటల పాటు లైవ్ లో చూసే అవకాశం కల్పిస్తున్నారని టికెట్ రేట్లు మాత్రం 300 రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని భోగట్టా. ఈరోజు రిలీజ్ కానున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఏపీ ఫలితాల గురించి దాదాపుగా క్లారిటీ వచ్చేస్తుందని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus