Salaar: సలార్ సినిమా విషయంలో ట్రోల్స్ కి గురవుతున్న వేణు స్వామి?

  • December 22, 2023 / 10:39 PM IST

సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ ఒక్కసారిగా వార్తలలో నిలిచారు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన పలువురు సినిమా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి జాతకాలను తెలియజేశారు. అయితే ఈయన చెప్పిన కొన్ని విషయాలు నిజం కావడంతో పెద్ద ఎత్తున ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో ఈయన తరచూ సెలబ్రెటీల జాతకాలను చెబుతూ వార్తలు నిలిచారు. ఇక ప్రభాస్ కెరియర్ గురించి చెబుతూ ప్రభాస్ కెరియర్ పతనం కాబోతుందని ఈయన నటించిన సినిమాలన్నీ కూడా కష్టమని చెప్పుకు వచ్చారు.

అదేవిధంగా సలార్ సినిమా కూడా మరోసారి ప్రభాస్ అభిమానులను నిరాశ పరుస్తుంది అంటూ ఈయన కామెంట్లు చేయడం విశేషం అయితే ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందారు. తాజాగా నేడు ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు విడుదలై మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని సూపర్ సక్సెస్ అందుకుంది.

ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున వేణు స్వామి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. గతంలో కెసిఆర్ గెలుస్తారని ప్రభాస్ సినిమా సక్సెస్ కాదంటూ ఈయన కామెంట్లు చేశారు. దీంతో ముందు ఈయన జాతకం చెప్పించుకొని అమ్మవారికి పూజ చేయాలని నా దగ్గర ఒక రెమిడి ఉంది వస్తావా అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇక మరి కొంతమంది ఈయనకు మామూలు రివెంజ్ ఇవ్వకూడదని ఒకసారి రౌండఫ్ చేయాలి అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో వేణు స్వామి చెప్పిన జాతకం నిజం కాకపోవడంతో ఈయన జాతకమే బాగాలేదు అంటూ ప్రభాస్ అభిమానులు నేటిజన్స్ వేణు స్వామిపై ట్రోల్ చేస్తున్నారు. ఈ దెబ్బతో వేణు స్వామి ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానేస్తారా లేదంటే ఈ విషయంపై ఆయన రియాక్ట్ అవుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus