ప్రభాస్ అభిమానులను కలవరపెడుతున్న న్యూస్

  • February 15, 2017 / 06:44 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ బ్యాచిలర్ ప్రభాస్. 37 సంవత్సరాల ఈ యంగ్ రెబల్ స్టార్  బాహుబలి చిత్రం తో ఇండియన్ స్టార్ గా ఎదిగారు. పెళ్లిని పోస్ట్ పోన్ చేసి ఈ చిత్రం కోసం కష్టపడినందుకు మంచి ప్రతిఫలం దక్కిందని అభిమానులు సంబరపడ్డారు. జనవరిలో రాజమౌళి శిబిరం నుంచి బయటికి రావడంతో ఇక పెళ్లి శుభవార్త వింటామని ఆనందపడ్డారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా బాహుబలి షూటింగ్ అయిన వెంటనే పెళ్లి చేసేస్తాను అంటూ అనేక సార్లు చెప్పారు. దీంతో ప్రభాస్ ని ఈ ఏడాది పెళ్లిపీటలపై చూస్తామని అందరూ ఎదురుచూసారు. కానీ ఆ విషయాన్నీ పక్కన పెట్టి డార్లింగ్ సుజీత్ సినిమాను ప్రారంభించారు.

150 కోట్లతో మూడు భాషల్లో యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ చిత్రం పూర్తి అయ్యేసరికి సంవత్సరం అవుతుందని తాజా సమాచారం. ఇదే ప్రభాస్ అభిమానులను కలవరపెడుతోంది. ఇప్పటికే పెళ్లి చేసుకునే వయసు దాటిపోయి పెళ్లికాని ప్రభాస్ గా విమర్శలు వస్తుంటే.. ఇంకా ఆలస్యం చేయడం ఏమిటని ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభాస్ మనసులో ఏముందో త్వరలో అతన్నే అడిగి తెలుసుకోవాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus