Prabhas: ప్రభాస్‌ భోజనాలే కాదు… చీరలు కూడా ఇస్తున్నాడా? ఏంటో ఆమె స్పెషల్‌?

ప్రభాస్‌ గురించి అతనితో పని చేసే నటులు, సాంకేతిక నిపుణులు ఇచ్చే పెద్ద కంప్లైంట్‌ ఏంటో మీకు తెలుసుగా.. దాని గురించి ఇప్పటికే చాలామంది మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు కూడా. ఆయన ప్రేమాభిమానాల భోజనం బారిన పడిన వారు చాలామందే ఉన్నారు. ఒక హీరో ఫ్యామిలీ కోసమైతే ఏకంగా ఓ హోటల్‌ రూమ్‌ నిండా సరిపడేంత ఫుడ్‌ పంపించారు. ఇదంతా ఓవైపు.. ఇన్నాళ్లూ మనకు తెలిసిన సైడ్‌. అయితే ప్రభాస్‌లోని మరో యాంగిల్‌ బయటకు వచ్చింది. అదే చీరల బహూకరణ.

Prabhas

అవును ప్రభాస్‌ ఒక హీరోయిన్‌కి శారీని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమెనే చెప్పారు. ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ది రాజా సాబ్‌’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సినిమాలోని హీరోయిన్లు మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ వచ్చారు. ఈ క్రమంలో రిద్ధి స్టేజీపైకి వచ్చి మాట్లాడుతూ తాను కట్టుకున్న చీర ప్రభాస్‌ ఇచ్చిందే అని చెప్పింది.

ప్రభాస్ కోసం సినిమా చేయటం సంతోషంగా ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు కానుకగా ఇచ్చిన చీర కట్టుకొని ఈ రోజు ఈ ఈవెంట్‌కి వచ్చాను అని రిద్ధి కుమార్ చెప్పగానే ఈవెంట్‌ జరుగుతున్న ఏరియా మొత్తం హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, దానికి అభిమానులు, ఆహూతుల రియాక్షన్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్‌ భోజనాలే కాదు.. ఇలా చీరలు కూడా గిఫ్ట్‌లుగా ఇస్తాడా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రిద్ధి కుమార్‌తో ప్రభాస్‌ ఫ్రెండ్‌షిప్‌ ఇప్పటిది కాదు. ‘రాధేశ్యామ్‌’ సినిమాలోనూ ఇద్దరూ కలసి నటించారు. ఆ సందర్భంగానే ఇద్దరికీ పరిచయం. ఈ చీరను ఆ సినిమా సమయంలోనే, అదయ్యాకనో ఇచ్చి ఉంటారు. పోన్లెండి ప్రభాస్‌ కొత్త గిఫ్ట్‌ల సంగతి ఈ ఈవెంట్‌ ద్వారా బయటకు వచ్చింది.

‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus