Prabhas, Hanu Raghavapudi: ఆ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ కొత్త మూవీ.. ఇండస్ట్రీ హిట్ అంటూ?

  • November 20, 2023 / 07:43 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ క్రేజ్ ను పెంచుకుంటుండగా ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోందని వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ హను రాఘవపూడి కాంబో గురించి వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయని తెలుస్తోంది.

ప్రభాస్ రేంజ్, క్రేజ్ వేరే లెవెల్ అని సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమా సినిమాకు భిన్నమైన కథను ఎంచుకుంటున్న ప్రభాస్ వేర్వేరు జానర్లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ప్రభాస్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సలార్ సినిమాతో 2023 బాక్సాఫీస్ లెక్కల్ని పూర్తిస్థాయిలో మార్చబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలార్1 సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. సలార్1 సినిమా కోసం ప్రభాస్ ఎంతో కష్టపడగా ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ప్రభాస్ మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను కూడా మెప్పించే కథాంశాలకు ఓటేస్తున్నారు. (Prabhas) ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus