మళ్ళీ వెతుకులాట మొదలు పెట్టిన జక్కన్న..!

‘ఆర్.ఆర్.ఆర్’ మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసినందుకు దిష్టి తగిలినట్లుంది. రెండో షెడ్యూల్ కి మాత్రం ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడ్డాయి. ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం చరణ్ కు గాయమవ్వడం కారణంగా మూడు వారాల పాటు బ్రేక్ షూటింగ్ కు బ్రేక్ పడింది. మరోవైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా నటించాల్సిన బ్రిటీష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ కూడా కొన్ని కుటుంబ పరిస్థితుల కారణంగా తప్పుకుంది. ఇక ఈమె స్థానంలో శ్రద్దా కపూర్ ను తీసుకున్నట్టు టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం… శ్రద్దా కపూర్ ‘ఆర్ఆర్ఆర్’లో నటించట్లేదట. ఇప్పటికే శ్రద్దా కపూర్ వేరే చిత్రానికి కమిటయ్యిందట. దీంతో ‘ఆర్ఆర్ఆర్’లో నటించట్లేదని స్పష్టమవుతుంది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ చిత్రంలో నటించే అవకాశం వస్తే.. ఎంతటి హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి ఓకే చెప్పేస్తుంది. కానీ ఈ బాలీవుడ్ భామలు మాత్రం జక్కన్నను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ హీరోయిన్ని వెతికే పనిలో జక్కన్న బిజీగా గడుపుతున్నాడు. పరిణితి చోప్రాను అనుకున్నా… ఇంకా ఆ విషయం పై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక ఈ చిత్రంలో మరికొన్ని ముఖ్యమైన పాత్రల కోసం అజయ్ దేవగన్, సముద్రఖని ను ఇప్పటికే ఫైనల్ చేసారు. ‘డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ ఫై డీ.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. జులై 30, 2020 లో విడుదల చేయబోతున్నట్టు అప్పుడే జక్కన్న ప్రకటించేశాడు కూడా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus