Prabhas: రాజమౌళి పద్ధతినే నీల్ కూడా ఫాలో అవుతున్నాడా..!

  • June 8, 2022 / 06:44 PM IST

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. ‘హోంబెల్ ఫిలిమ్స్’ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఆల్రెడీ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మిగతా భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని టీం భావిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ నుండీ చిన్న విరామం తీసుకుని బరువు తగ్గే పనిలో ఉన్నాడు. 2023 వ సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ కోసం ప్రభాస్ కు ఓ ఐడి కార్డు క్రియేట్ చేసింది చిత్ర బృందం.

ప్రభాస్ కు మాత్రమే కాదు కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐడి కార్డులు ఎరేంజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఐడి కార్డుకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ప్రభాస్ పూర్తి పేరు ఉంది. వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి అనేది ప్రభాస్ పూర్తి పేరు అన్న సంగతి తెలిసిందే. ఇదే పేరుతో ‘సలార్’ షూటింగ్ కోసం ప్రభాస్ కు ఐడి కార్డు చేశారు. ఇందులో పేరు క్రింద హీరో అని కూడా రాసి ఉంది.

ఇందులో ప్రభాస్ ఫోటో ‘సాహో’ టైంలో తీసుకున్నది. ఇక ఈ ఐడి కార్డు సిస్టమ్ ను షూటింగ్లలో భాగం చేసింది రాజమౌళి. ‘బాహుబలి’ కోసం ఆయన ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.’ఆర్.ఆర్.ఆర్’ కోసం కూడా ఇదే పద్దతిని అనుసరించాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళి పద్ధతినే ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus