Prabhas: లుక్స్ తో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచిన ప్రభాస్.. సూపర్ లుక్ అనేలా?

  • December 16, 2023 / 04:14 PM IST

స్టార్ హీరో ప్రభాస్ ఈ మధ్య కాలంలో మీడియా ముందు ఎక్కువగా కనిపించడం లేదనే సంగతి తెలిసిందే. ప్రభాస్, పృథ్వీరాజ్, ప్రశాంత్ నీల్ లను జక్కన్న ఇంటర్వ్యూ చేయగా ఒక విధంగా ఇదే సలార్ మూవీ ఈవెంట్ అని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అయిన ప్రభాస్ ఫోటో ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. శృతి హాసన్ మాత్రం సలార్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు.

సలార్ ప్రీ రిలీజ్ టాక్ పాజిటివ్ గా ఉండగా ఇప్పటికే కొంతమంది ప్రముఖులు ఈ సినిమాను చూశారని సమాచారం అందుతోంది. వాళ్ల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందిందని తెలుస్తోంది. రిపీట్ మోడ్ లో ప్రేక్షకులు సలార్ ను చూస్తారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సలార్ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో థియేటర్లలో విడుదల కానుంది. సలార్ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సీన్లు ఉన్నాయని అందువల్లే ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చిందని నిర్మాతలు చెబుతున్నారు.

ఆ యాక్షన్ షాట్స్ ను కట్ చేయడం ఇష్టం లేక ఎ సర్టిఫికెట్ కు అంగీకరించామని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సలార్ సినిమా రిలీజ్ సమయానికి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. కేజీఎఫ్, సలార్ వేర్వేరు ప్రపంచాలు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సలార్ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ప్రశాంత్ నీల్ మార్కెట్ ను ఈ సినిమా మరింత పెంచుతుందేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలుకానుంది. ఈ సినిమా కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus