Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?
- February 3, 2026 / 07:56 PM ISTByFilmy Focus Writer
సాధారణంగా దర్శకుడు మారుతి అంటే నిర్మాతలకు మినిమం గ్యారెంటీ. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ రోజుల్లో సినిమాను ఫినిష్ చేయడంలో ఆయన దిట్ట. కానీ ‘ది రాజా సాబ్’ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయిందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం తీసిన సుమారు 50 కోట్ల విలువైన ఫుటేజ్‌ను ఎడిటింగ్‌లో తీసేశారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Prabhas
నిజానికి మారుతి తన పాత సినిమాలను చాలా పక్కా ప్లానింగ్‌తో కంప్లీట్ చేసేవారు. కానీ ప్రభాస్ ఇమేజ్, పాన్ ఇండియా మార్కెట్ ఒత్తిడి వల్ల ఈసారి ఆయన లెక్కలు తప్పినట్లు కనిపిస్తోంది. దాదాపు గంట నిడివి గల సీన్లను షూట్ చేసి, అవి కథకు సెట్ కాకపోవడంతో పక్కన పెట్టేశారట. గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం, మధ్యలో జరిగిన కథా మార్పుల వల్ల షూటింగ్ రోజులు పెరిగిపోయి, నిర్మాతకు భారీగానే ఖర్చు మిగిలిందని సినీ వర్గాల సమాచారం.
సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కూడా స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కొన్ని సన్నివేశాలు అసలు కథకు సంబంధం లేకుండా సాగాయని, మేకింగ్‌లో క్లారిటీ మిస్ అయిందని ఆడియన్స్ ఫీలయ్యారు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ సీన్లు ప్లాన్ చేసినా, అవి ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అవ్వడం వల్ల ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెర వేయక తప్పలేదు. దీంతో ఆ శ్రమ, డబ్బు రెండూ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెద్ద సినిమాల విషయంలో గ్రాఫిక్స్ ఆలస్యమైతే వడ్డీల భారం పెరిగి బడ్జెట్ కంట్రోల్ తప్పడం సహజం. మారుతి ఎప్పుడూ నిర్మాతలకు మేలు చేయాలనే చూస్తారు కానీ, ‘రాజా సాబ్’ విషయంలో గ్రాఫిక్స్ టీమ్, మేకింగ్ ఆయన చేతిలో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. భారీ ప్రాజెక్టుల ఒత్తిడిలో తన సహజ సిద్ధమైన మేకింగ్ స్పీడ్‌ను మారుతి కోల్పోయారని అర్థమవుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సుమారు 45 శాతం పైగా నష్టాలను మూటగట్టుకున్నట్లు టాక్.












