పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన టీజర్ తప్ప ట్రైలర్, పాటలు వంటివి పెద్దగా బజ్ ఏమీ క్రియేట్ చేయలేదు. కానీ ప్రభాస్ సినిమాకి ఇలాంటి హడావిడి అవసరం లేదు.ప్రమోషన్ కంటెంట్ ఎలా ఉన్నా సినిమా కనుక హిట్ అయితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
పైగా ఈ సినిమాలో ప్రభాస్ ని బుజ్జిగాడు స్టైల్లో చూపించబోతున్నట్టు మారుతీ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. అది చాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వడానికి..! సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్లోని కైతలపూర్, కూకట్ పల్లిలో ఏర్పాటు చేశారు.ఈ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ డ్రెస్సింగ్ చాలా బాగుంది.
అయితే ‘ది రాజాసాబ్’ సినిమాలో స్లిమ్ గా కనిపిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు కొంచెం దిట్టంగా కనిపిస్తున్నాడు. తన నెక్స్ట్ సినిమాకి అనుకుంట మేకోవర్ ఛేంజ్ చేసుకున్నాడు. ఫుల్ గడ్డంతో రఫ్ లుక్లో కనిపిస్తూనే.. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. పిలక కూడా వేసుకోవడంతో ప్రభాస్ మరింత కొత్తగా కనిపిస్తున్నాడు. కచ్చితంగా ఈ లుక్ ‘స్పిరిట్’ సినిమా కోసమే అయ్యుంటుంది అని అంతా అనుకుంటున్నారు.
అది నిజమే అని ప్రభాస్ కూడా కన్ఫర్మ్ చేశాడు. ‘స్పిరిట్’ షూటింగ్ నుండే వస్తున్నట్టు ప్రభాస్ తెలిపాడు. అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని ‘కల్ట్ డైరెక్టర్’ అంటూ కొనియాడాడు ప్రభాస్.