అడ్వాన్స్ ఉంది కాబట్టి సినిమా చేయాల్సిందే డార్లింగ్..!

  • December 14, 2019 / 06:20 PM IST

‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆయనతో సినిమా చెయ్యాలి అని.. ఏ ప్రొడ్యూసర్ కు ఉండదు చెప్పండి. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తే.. ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవచ్చు. కాబట్టి నిర్మాతలు ఎగబడుతున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటికే తన స్నేహితులు ‘యూవీ క్రియేషన్స్’ వారితో సినిమాలు చేస్తానని మాటిచ్చేసాడు కాబట్టి వరుసగా ‘సాహో’ ‘జాన్’ సినిమాలు వారితోనే చేస్తున్నాడు. అయితే ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల సమయంలోనే.. ప్రభాస్ తో సినిమా చేయడానికి 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు. ఆ తరువాత ఎప్పుడూ ప్రభాస్ ను వారు డిస్ట్రబ్ చేయలేదట. కానీ ఆ తరువాత ఓసారి అడుగగా.. మీతో సినిమా చేస్తాను అని ప్రభాస్ చెప్పడంతో మళ్ళీ వారు వచ్చి మరో 8 కోట్లు ఇచ్చారట.

అలా 13 కోట్ల వరకూ అడ్వాన్స్ ప్రభాస్ కు ఇచ్చి డేట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ‘జాన్’ తరువాతి సినిమాని ‘మైత్రి’ వారితోనే చెయ్యాలి. డైరెక్టర్, స్టోరీ ప్రభాస్ కు నచ్చితే సినిమా పట్టాలెక్కేసినట్టే..! అయితే ‘జాన్’ తరువాత ప్రభాస్ తో సినిమా చెయ్యాలని దిల్ రాజు తెగ ట్రై చేస్తున్నాడని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలో ప్రభాస్ ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి..!

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus