ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రత్యేకతలు

టాలీవుడ్ లో సీనియర్ బ్యాచిలర్ గా పిలివదగ్గ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి చిత్రంతో ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్ ఈ ఏడాది 37 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.  బాహుబలి కంటే ముందే పెళ్లి చేయడానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అంతా ఏర్పాట్లు చేశారు. అయితే చరిత్ర సృష్టించగల కథ కావడంతో, అందుకోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో డార్లింగ్ పెళ్లిని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు బాహుబలి కంక్లూజన్ కూడా పూర్తి కావచ్చింది.

ఇక ఆలస్యం చేసేది లేదని ప్రభాస్ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అందుకు ఆయన కూడా ఒకే చెప్పారు. రీసెంట్ గా ప్రభాస్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి మిత్రులతో చెప్పుకున్నారంట. వైజాక్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన ఆమె తన కోసం మూడేళ్లు ఎదురుచూసిందని, ఆమె మంచి రూపవతి అని, ఎక్కువగా చదువుకుందని స్నేహితులతో వెల్లడించారు. గౌరవం కలిగిన కుటుంబం కావున నిక్షితార్ధం కాక ముందే ఆమె పేరు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఇరుకుటుంబాల సభ్యులు కలుసుకొని పెళ్లి గురించి చర్చించుకోనున్నట్లు సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus