కాబోయే భార్య గురించి బయటపెట్టిన ప్రభాస్!

  • March 6, 2017 / 07:40 AM IST

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ వంద కోట్ల నుంచి వెయ్యికోట్ల స్థాయికి చేరుకుంటోంది. అంతకంటే విలువైనదిగా వారిద్దరి బంధం బలపడుతోంది. మొదట రాజమౌళితో ప్రభాస్ ఛత్రపతి చేశారు. అనంతరం బాహుబలి మూవీకి పనిచేశారు. రెండు పార్టులుగా నిర్మితమయిన ఈ సినిమా కోసం ప్రభాస్ నాలుగేళ్లు జక్కన్నతో కలిసి ప్రయాణించారు. ఈ సమయంలో వీరిద్దరూ గురు శిష్యులుగా మారిపోయారు. దర్శకధీరుడి గురించి ఓ ఇంటర్వ్యూ లో డార్లింగ్ మాట్లాడుతూ ” రాజమౌళిని ఒక దర్శకుడిగా కాకుండా గురువుగా  భావిస్తాను. నాకు ఆయన యూనివర్శిటీ ప్రొఫిసర్ లా కనిపిస్తారు.

అతని దగ్గరి నుంచి నేను నటనకు సంబంధించినవే కాకుండా, పర్సనల్ విషయాలకు సంబంధించిన అనేక విషయాలను నేర్చుకున్నాను” అని తెలిపారు. ఇక తనకు కాబోయే భార్య  గురించి ప్రస్తావిస్తూ.. ” నా కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా  పెదనాన్న కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కూడా భోజన ప్రియులు. నా భార్యకు రకరకాల వంటలు తెలియకపోయినా పరవాలేదు, కాని మాతోపాటుగా రకరకాల వంటలను ఆస్వాదిస్తూ తినగల మనస్థత్వం  ఉండాలి” అంటూ ప్రభాస్ మనసులోని మాటను బయట పెట్టారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus