Salaar: ప్రభాస్.. ‘సలార్’ మూవీకి సంబంధించిన లీక్డ్ ఫోటోలు వైరల్.!

  • January 25, 2023 / 08:45 PM IST

‘బాహుబలి'(సిరీస్) తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అతని ఇమేజ్ బాగా పెరిగింది. బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మార్కెట్ కూడా 10 రెట్లు పెరిగింది. అయితే ‘బాహుబలి'(సిరీస్) తర్వాత వచ్చిన ‘సాహో’ అంతంత మాత్రం ఆడినా… ‘రాధే శ్యామ్’ మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ రెండు సినిమాల విషయంలోనూ ప్రభాస్ ఇమేజ్ ను దర్శకులు పూర్తి స్థాయిలో వాడుకోలేదు అనేది విశ్లేషకుల వాదన.

ప్రభాస్ మాస్ ఇమేజ్ కు తగ్గ సినిమా పడితే కనుక అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వుద్ది. ఆ హిట్టు దెబ్బకు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అయిపోద్ది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా. ‘కె.జి.ఎఫ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ 28న ‘సలార్’ రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ‘సలార్’ సినిమా షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి అనే చెప్పాలి. ఆ ఫోటోల్లో ప్రభాస్ లుక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. అలాగే స్టైలిష్ గా కూడా ఉందని చెప్పొచ్చు. శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు వంటి స్టార్లు కూడా ఈ మూవీ నటిస్తుండడం విశేషం.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus