ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ రావడమేమో గానీ ఆయన నుండి మూవీ రావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. బాహుబలి 2 విడుదలైన రెండేళ్లకు ఆయన సాహో విడుదల చేశారు. గత ఏడాది ఆగస్టులో ఆ చిత్రం విడుదల కాగా, ప్రభాస్ మరో చిత్రం పూర్తి చేయలేదు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ లవ్ డ్రామా షూటింగ్ మొదలై ఏడాదిన్నర అవుతుంది. ప్రభాస్ త్వరగా సినిమాలు చేయాలని అనుకుంటున్నా భారీ చిత్రాలు కావడం వలన ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. కాగా ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఓ మూవీ కమిట్ అయ్యారు.
అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ మూవీకి ముందే ప్రభాస్ వద్దకు ఓ భారీ ప్రాజెక్ట్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయాలని భావించారట. మోహన్ కృష్ణ ప్రభాస్ కి కథ కూడా వినిపించారట. కథ బాగుంది కానీ ఈ సినిమా చేయలేను అన్నారట.
దానికి కారణంగా భారీ చిత్రం నేపథ్యంలో రెండేళ్లు ఈ సినిమాకు డేట్స్ కేటాయించలేను అన్నారట. దీనితో మైత్రి మూవీ మేకర్స్ ఆ మూవీ ప్రయత్నాలు ఆపి వేశారట. అసలు కారణం అదైతే నాగ్ అశ్విన్ తో మూవీ ఎందుకు ఒప్పుకున్నారు. ఆ సినిమాకు రెండేళ్లు ఎలా డేట్స్ కేటాయించాడు అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. దీన్ని బట్టి చూస్తే నాగ్ అశ్విన్ పై పెట్టిన నమ్మకం,మోహన్ కృష్ణ పై ప్రభాస్ పెట్టలేక పోయారని అర్థం అవుతుంది. అందుకే డేట్స్ సాకుగా చూపి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించుకున్నారు.
Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు