‘వంద చిత్రాలు చేసినా రాని పేరు ఒక బాహుబలి చిత్రం ద్వారా వచ్చింది’.. ఓ ఇంటర్వ్యూ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన మాటలివి. అవును.. అందులో వంద శాతం నిజముంది. బాహుబలి బిగినింగ్ తో ఇండియన్ స్టార్ గా డార్లింగ్ ఎదిగారు. ఇప్పుడు ఆయన చేయబోయే చిత్రాలపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న బాహుబలి కంక్లూజన్ తో రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. బాహుబలి చిత్రాలతో వచ్చిన పేరుని కాపాడుకోవటానికి ప్రభాస్ గట్టి నిర్ణయం తీసుకున్నారు.
మూడేళ్ల వరకు బయట నిర్మాతలతో చిత్రాలను చేయకూడదని డిసైడ్ అయ్యారంట. ఎందుకని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. బాహుబలి తర్వాత చేసే సినిమాలు భారీ బడ్జెట్ లోనే నిర్మితం కావాలని డార్లింగ్ భావిస్తున్నారు. అందుకే తన 19వ సినిమాను యువీ క్రియేషన్స్ చేతిలో పెట్టారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని ప్రభాస్ స్నేహితులు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఫిల్మ్ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాలు కూడా యువీ క్రియేషన్స్ వారే నిర్మించనున్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.