తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రభాస్ పేరు ముందుంది. ముప్ఫైఏడు సంవత్సరాలు నిండిన ఈ యంగ్ రెబల్ స్టార్ ని పెళ్లి ఎప్పుడు? అని ఎంతో మంది.. ఎన్నో సార్లు అడిగినా నవ్వుతూ సమాధానం దాటవేసేవారు. ఈ రోజు నేషనల్ మీడియా ఆయన్ను ఇదే ప్రశ్నను అడగ్గా క్లారిటీ ఇచ్చారు. ‘చాలా మంది నన్ను అభిమానించడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నా మహిళా అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పట్లో అలాంటి పనులు చేయడం లేదు. కనీసం దాని గురించి ఆలోచించడం కూడా లేదు.’ అని పెళ్లి మాట ఎత్తకుండా తెలివిగా సమాధానం ఇచ్చారు.
ఇక అనుష్క తో ప్రేమ గురించి వస్తున్న వార్తలపై మీరేమి అంటారు ? అని అడగగా.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ‘ఇలాంటి గాసిప్స్ సాధారణం. ఒక్క నటితో రెండు కన్నా ఎక్కువ చిత్రాల్లో నటిస్తే.. ప్రజలు ఇలాంటి రూమర్లను నమ్మేస్తారు. మొదట్లో నేనూ కొంత బాధపడేవాడ్ని. ‘ఇలాంటివి ఎలా రాస్తారు?’ అనుకునేవాడ్ని. కానీ ఇప్పుడు.. ఈ వార్తలు నన్ను ఏమాత్రం బాధించడం లేదు.” అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.