షాక్ ఇస్తున్న ప్రభాస్ రెమ్యూనరేషన్…!

  • March 4, 2020 / 04:09 PM IST

ప్రభాస్ తో సినిమా చెయ్యాలని రేసులో చాలా మంది దర్శకులు ఉంటే .. ఎవ్వరూ ఊహించని విధంగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఛాన్స్ కొట్టేసాడు. సోషియో ఫాంటసీ … కం సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రతిష్టాత్మక ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏకంగా ఈ చిత్రానికి 350 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. ‘ప్రభాస్ ‘పాన్ ఇండియా’ చిత్రం ఎప్పుడో చేసేసారు.ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేద్దాం’ అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ధీమాగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రానికి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత ఉండి ఉంటుంది అనే దాని పై తెగ చర్చ జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ 18 నెలలు కాల్ షీట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకోసం ఏకంగా 70 కోట్ల వరకూ ప్రభాస్ అందుకోబోతున్నారని… అంతేకాకుండా శాటిలైట్ రైట్స్ కూడా తీసుకునే అవకాశం ఉందని… మొత్తంగా 100 కోట్ల వరకూ అందుకోబోతున్నట్టు సమాచారం. దీంతో పారితోషికం విషయంలో ప్రభాస్ సరికొత్త రికార్డు అనే చెప్పాలి.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus