అక్కడ రజినీ తర్వాత ప్రభాసే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ అయ్యింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇది సూపర్ హిట్ మూవీ. సో వరల్డ్ వైడ్ గా ఇది యావరేజ్ మూవీ. అయితే కేవలం ‘బాహుబలి’ చిత్రంతో వచ్చిన క్రేజ్ వల్లే ‘సాహో’ చిత్రం బాలీవుడ్ లో సక్సెస్ సాధించిందని చాలా మంది కామెంట్లు చేసిన వారు లేకపోలేదు. అయితే అదంతా ఇప్పుడు తప్పని ప్రూవ్ అయ్యింది. అసలు విషయం ఏమిటంటే.. జపాన్ లో మన సౌత్ హీరోల సినిమాలను పెద్దగా ఆదరించరు. ఒక్క రజినీ సినిమాలను మాత్రమే వారు ఆదరిస్తారు. కానీ ‘బాహుబలి’ తో ఆ లిస్ట్ లో ప్రభాస్ కూడా చేరాడు.

మన ప్రభాస్ ను చూడడానికి అక్కడి జనాలు కూడా మన దేశానికి వచ్చిన రోజులున్నాయి. అయితే ఇదంతా ‘బాహుబలి’ పుణ్యమే అనుకుంటే కాదు అని ‘సాహో’ చిత్రం ప్రూవ్ చేసింది. ఈ చిత్రాన్ని ఇటీవల జపాన్ లో విడుదల చేయగా అక్కడ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. పెద్ద హడావిడి.. ప్రమోషన్స్ లేకుండా ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేసినప్పటికీ.. మంచి కలెక్షన్లను సాధిస్తుంది. అదే ప్రమోషన్ చేసి విడుదల చేసి ఉంటే.. ఈ చిత్రం అక్కడ మరింతగా ఓపెనింగ్స్ ను రాబట్టేదేమో. ఏమైనా ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus