కథ బాగుండడం వేరు.. సూటవడం వేరు. అందుకే మహేష్ 24 సినిమా కథ బాగున్నా.. తనకి సూట్ కాదని భావించి సూర్య కి సూచించారు. మహేష్ అంచనా నిజమై.. సూర్య కష్టం ఫలించి విజయం వరించింది. ఇలా స్టార్ హీరోలు తమ వచ్చిన కథలు బాగుండడమే కాదు.. తమకి సూటవుతాయా? కాదా? అని బేరీజు వేసుకుంటున్నారు. తాజాగా ప్రభాస్ కూడా తన వద్దకు వచ్చిన కథ విషయంలో ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సొంత సంస్థ గోపికృష్ణ బ్యానర్లో మూవీ చేయనున్నారు. దీన్ని జిల్ ఫెమ్ డైరక్టర్ రాధాకృష్ణ డైరక్ట్ చేయనున్నారు.
అతను చెప్పిన కథ తన కంటే రామ్ చరణ్ తేజ్ కి బాగుంటుందని ప్రభాస్ కి అనిపించిందంట. అదే విషయాన్నీ డైరక్టర్ కి కూడా చెప్పారంట. కానీ రాధాకృష్ణ మాత్రం చరణ్ కి ఆ స్టోరీ ఇవ్వడానికి ఆసక్తిగా లేనట్టు తెలిసింది. ప్రభాస్ తోనే తీస్తానని పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. సాహో తర్వాత ప్రభాస్ బాలీవుడ్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. మూడేళ్ళక్రితం ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారు. అదే విధంగా రాధాకృష్ణకు కూడా మాట ఇచ్చారు. మరి వీరిద్దరిలో ఎవరి సినిమాని ముందుగా మొదలెట్టాలనేది ప్రభాస్ కి చాలా కష్టంగా ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.