మార్చిలో ప్రభాస్ పెళ్లి అంటూ జోరుగా ప్రచారం

  • May 29, 2017 / 06:59 AM IST

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం దొరికింది కానీ, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే దానికి ఎంత వెతికినా జవాబు దొరకడం లేదు. ప్రభాస్ వివాహం పై రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదు. మీడియా ప్రభాస్ ని నేరుగా  ఓ ఇంటివారు ఎప్పుడవుతారని అడిగినప్పుడు.. చేసుకోవాలి.. అని చెబుతున్నాడే తప్ప, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో స్పష్టంగా బయటపడడం లేదు. అయితే రెండు రోజులుగా ఓ న్యూస్ సోషల్ మీడియా సూపర్ వేగంగా దూసుకుపోతోంది. ప్రభాస్‌ పెళ్లికి మంచి ముహూర్తాలు ఉంటే చూడమని పెదనాన్న కృష్ణంరాజు పురోహితులను అడిగారనే వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

కృష్ణంరాజు ప్రభాస్‌ పెళ్లి ముహూర్తం చూడమని ఎవరికి చెప్పారో తెలియదు కానీ, కొంతమంది పండితులు ప్రభాస్ పెళ్లి జాతకం రాసి, నెట్ లో పెట్టేసారు. ‘‘ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రభాస్‌ వ్యక్తిగత జీవితంలో మంచి ఘడియలు మొదలవుతున్నాయి. 2018 లో కచ్చితంగా ఓ ఇంటివాడు అవుతాడు. వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్‌ పెళ్లి అయ్యే అవకాశం ఉంది’’ అని సదరు పండితులు చెప్పుకొచ్చారు. మరి వీరు చెప్పిన జాతకం ఎంత వరకు కరక్ట్ అవుతుందో కొన్ని రోజుల్లో తెలియనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus