బాహుబలి 2 కి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రభాస్.!

ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేక రోజు లంటూ కొన్ని ఉంటాయి. అవి పుట్టినరోజులు కావచ్చు.. అవార్డులు అందుకున్నరోజు కావచ్చు. ప్రభాస్ కి మాత్రం ఈరోజు (ఏప్రిల్ 28 ) వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం ఇదే రోజు బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ కళాఖండం 1700 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. మూడు జాతీయ అవార్డులను కైవశం చేసుకుంది. జపాన్ భాషలోనూ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి వందరోజులు పూర్తి చేసుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. త్వరలో చైనాలో కలక్షన్ల సునామీ సృష్టించడానికి సిద్ధమవుతోంది.

అటువంటి ఈ సినిమా యంగ్ రెబల్ స్టార్ ని ఇండియన్ స్టార్ గా చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభాస్ ఎక్కడికి పోయినా అభిమానులు చుట్టుముడుతారు. విదేశాల్లోనూ సైతం ప్రభాస్ కి ఫాలోవర్స్ ని పెంచింది. అంతటి గుర్తింపును, పేరుని సంపాదించి పెట్టిన బాహుబలి 2 రిలీజ్ అయి వన్ ఇయర్ పూర్తి చేసుకోవడంతో.. ప్రభాస్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “మా చిత్రం బాహుబలి కంక్లూజన్ నేటితో ఒక ఏడాది పూర్తి చేసుకుంది. ఈరోజు నాకు ఎప్పటికి ప్రత్యేకం. నా అభిమానులందరికీ పెద్ద హగ్. మీ అందరికీ ప్రేమాభివందనాలు. ఇంతమంచి అవకాశాన్ని ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు. అలాగే చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని పోస్ట్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus