ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే కెరీర్ తొలి దశలో రామ్ చరణ్ కూడా సినీ ఫీల్డ్ లో అడ్జస్ట్ అవ్వడానికి ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేశారు. ఈ నేపథ్యంలో తాను తీసుకునే కథల గురించి ఆయన ఎంతో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవారు. అందుకే చాలా మూవీస్ స్టోరీ నచ్చక రామ్ చరణ్ రిజెక్ట్ చేయడం జరిగింది.
అయితే ఇలా రామ్ చరణ్ రిజెక్ట్ చేసి వేరే హీరో దగ్గరకు వెళ్ళిన మూవీస్ ఆ తరువాత సూపర్ డూపర్ సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే వాటిలో ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ ఇంతకు ముందు రామ్ చరణ్ వద్దు అని ఛీ కొట్టిన కథతో ప్రభాస్ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏమిటా అనుకుంటున్నారా..
ఫాన్స్ ముద్దుగా డార్లింగ్ అని పిలిచే స్థాయికి ప్రభాస్ ను తీసుకొచ్చిన డార్లింగ్ మూవీ ను రామ్ చరణ్ వద్దు అనుకున్నాడు. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన డార్లింగ్ మూవీ 2010లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ,యూత్ ఫుల్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి బాగా ఆకట్టుకుంది ఈ చిత్రం. హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ సాధించింది.
అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే డార్లింగ్ మూవీ ఫస్ట్ ఛాయిస్ (Prabhas) ప్రభాస్ కాదు రామ్ చరణ్. అయితే చరణ్ కు ఈ మూవీ స్టోరీ పెద్దగా నచ్చలేదట. అందుకే సున్నితంగా ఈ చిత్రం నాకు సెట్ కాదు అని రిజెక్ట్ చేశాడు. దాంతో అటు ఇటు తిరిగి ఫైనల్ గా ఈ మూవీ ప్రభాస్ కు సెట్ అయింది. స్టోరీ బాగా నచ్చడంతో ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా డార్లింగ్ చిత్రం ప్రభాస్ కెరియర్ లోని ఒక మైలురాయిగా మిగిలిపోయింది.
‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!