Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మై డియర్ భూతం మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. అదరగొట్టిన ప్రభుదేవా

మై డియర్ భూతం మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. అదరగొట్టిన ప్రభుదేవా

  • June 23, 2022 / 09:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మై డియర్ భూతం మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. అదరగొట్టిన ప్రభుదేవా

డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలో దాగి ఉన్న టాలెంట్ బయటపెట్టారు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో వెండితెరపై ప్రభు దేవా మార్క్ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రభు దేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా తాజాగా ఈ మై డియర్ భూతం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్టర్ ఓ మై మాస్టర్ అంటూ ఫాస్ట్ బీట్‌‌తో సాగిపోతున్న ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్ అయింది. ఎప్పటిలాగే స్టైలిష్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు ప్రభుదేవా. నీ మనసు కన్న కళలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్ అంటూ రాసిన లిరిక్స్ ప్రేరణాత్మకంగా ఉన్నాయి. అరవింద్ అన్నెస్ట్ పాడిన ఈ పాటకు డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి అందించిన లిరిక్స్ ప్రాణం పోశాయి. రాజేష్, డి. ఇమ్మాన్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవెల్ మార్చేశాయి. పాటకు తగ్గట్టుగా డిఫరెంట్‌గా చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సాంగ్ మై డియర్ భూతం సినిమాకు మేజర్ అట్రాక్షన్ అవుతుందని స్పష్టమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఇకపోతే ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుందట. జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారని, ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని, ఈ మేకోవర్ నాచురల్‌గా ఉండాలని ఎంత కష్టపడ్డారో రీసెంట్‌గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కన్ఫర్మ్ చేసింది. ఈ లుక్ కోసం ఎలాంటి విగ్ వాడకపోవడం విశేషం. ప్రభు దేవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించేలా ఈ మూవీ రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు అన్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో హైలైట్ కానుందట. వీఎఫ్ఎక్స్ వర్క్ అబ్బురపరచనుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #My Dear Bootham
  • #Prabhudeva

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

14 hours ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

16 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 day ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

1 day ago

latest news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

56 mins ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

2 days ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

2 days ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

2 days ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version