డైరెక్టర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా, ఆర్ట్ డైరెక్టర్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న సగానికిపైగా జనాలు ఇండస్ట్రీకి వచ్చింది నటులుగా రాణిద్దామనే ఆశయంతోనే. అయితే.. పరిస్థితులు సహకరించక దొరికిన/కుదిరిన పొజిషన్ లో సెటిల్ అయిపోతారు. అలా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అది కుదరక యాంకర్ గా మారిన వ్యక్తి ప్రదీప్ మాచిరాజు. అందరిలాగే చిన్న యాంకర్ లా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ యాంకర్ గా ఎదిగాడు. ఏకంగా ఒక టాక్ షోను స్వయంగా హోస్ట్ చేసే స్థాయికి ఎదిగాడు. మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ప్లే చేశాడు. “గురువారం మార్చి ఒకటి” అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుదామనుకొన్నప్పటికీ.. ఆ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకొన్నాక ఆగిపోయింది. దాంతో ప్రదీప్ వెండితెర ఎంట్రీ ఆగిపోయింది అనుకొన్నారందరూ.
కట్ చేస్తే.. “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే సినిమాతో ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేశాడు ప్రదీప్. ఈ సినిమా పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని టాక్ షోల్లో పాల్గొన్న ప్రదీప్ తన లవ్ స్టోరీ గురించి చెప్పమంటే.. “ఇప్పుడు పేర్లెందుకు లెండి.. ఆ అమ్మాయికి పెళ్లైపోయి.. ఇప్పుడు హ్యాపీగా పిల్లలతో నా షోస్ చూస్తుంది” అని మాట దాటేశాడు. అయితే.. ఇదే షోలో ప్రియమణి, రశ్మి, తాను ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని.. ఆ గ్రూప్ లో చాలా సీక్రెట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు ప్రదీప్.
Most Recommended Video
యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!