Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?
- February 24, 2026 / 01:40 PM ISTByFilmy Focus Desk
ఇటీవల సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసిన విషయం యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి. ఎప్పటికప్పుడు ఆయన పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తూ ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ స్వయంగా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది.
Pradeep Machiraju
తెలుగు బుల్లితెరపై తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్రదీప్ , రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షోతో ఆయనకు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, తన మాటకారితనం, కామెడీ టైమింగ్‌తో యువతను ఆకట్టుకున్నాడు.

టీవీతోనే ఆగిపోకుండా సినిమాల వైపు అడుగులు వేసిన ప్రదీప్, మొదట కీలక పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. తాజాగా తన కొత్త సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, పెళ్లిపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. “ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మా అమ్మకి నచ్చిన అమ్మాయిని, ఓకే చెప్తాను” అని స్పష్టంగా చెప్పాడు. ప్రస్తుతం బంధువులలోనే సంబంధాలు చూస్తున్నామని, సరైన సమయం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ తప్పకుండా చెబుతానని కూడా హింట్ ఇచ్చాడు.
ఈ వ్యాఖ్యలు బయటికి రావడంతో ప్రదీప్ పెళ్లి త్వరలోనే జరిగే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మరోవైపు సినిమాల పరంగా కూడా బిజీగా ఉన్న ప్రదీప్, తన కొత్త మూవీపై మంచి నమ్మకంతో ఉన్నాడు. ఒక ఇంజనీర్ యువకుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్లు ఇప్పటికే ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ సినిమా ప్రదీప్‌కు హీరోగా పెద్ద బ్రేక్ ఇస్తుందా? అలాగే ఆయన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడో చూడాలి.















