యాంకర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ అంటే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. రియాలిటీ షోలు, టాక్ షోలు అంటూ రెగ్యులర్ గా టెలివిజన్ ఆడియెన్స్ కు టచ్ లోనే ఉంటాడు. ఇక అతని మొదటి సినిమా 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సినిమా మొదటి పాట ‘నీలి నీలి ఆకాశం’తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది.
గత ఎడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి 4కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే అందుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ప్రదీప్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక ఈవెంట్ కు అలాగే టాక్ షోకు డైలీ లక్షకు పైగా పేమెంట్స్ అందుకునే ప్రదీప్ ఈ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది.
ఎందుకంటే దర్శకుడు మున్నా చెప్పిన కథ బాగా నచ్చడంతో ఫ్రీగానే చేశాడట. దానికి తోడు మొదటి సినిమా కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ కాకుండా ఉండాలని ఆలోచించాడట. అయితే సినిమా బాక్సాఫిస్ కలెక్షన్స్ ను బట్టి లాభాల్లో షేర్స్ అంసుకోవచ్చని తెలుస్తోంది. మరో ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.