టాటూ గురించి బయటపెట్టిన నటి ప్రగతి
- February 16, 2017 / 01:38 PM ISTByFilmy Focus
దూకుడు, రేసుగుర్రం వంటి అనేక హిట్ సినిమాల్లో తల్లి పాత్రలో నటించి ప్రగతి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పాపులర్ అయ్యారు. యువతిగా ఉన్నప్పుడు హీరోయిన్ గా చేసినప్పుడు రాణి గుర్తింపు హీరో, హీరోయిన్లకు అమ్మగా నటించినప్పు లభించింది. అంతేకాదు కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కుంది. వాటిగురించి ఓ ఇంటర్వ్యూ లో వివరణ ఇస్తూ, తన భుజంపై నున్న టాటూ గురించి చెప్పింది. “చాలా మంది ఈ టాటూ వెనుక రహస్యం ఏమిటని అందరూ అడుగుతుంటారు. రహస్యం ఏమీలేదు.. నా చిన్నప్పుడు భుజంపై టీకా వేశారు. అప్పుడు ఆ ప్లేస్ లో మచ్చ ఏర్పడింది. స్లీవ్ లెస్ వేసుకున్నప్పడు ఆ మచ్చ స్పష్టంగా కనిపించేది. అందుకే దానిని కవర్ చేసుకోవడానికి పెద్దగా టాటూ వేసుకున్నాను” అని వివరించింది.
అదే విధంగా అమ్మ పాత్రలు వేసే మీకు ఈ టాటూ ఏమిటండీ ? అంటూ విమర్శించే వారికి ఈ ఇంటర్వ్యూలో ప్రగతి గట్టిగానే సమాధానం ఇచ్చింది. ” నేను అమ్మ పాత్రలు పోషించక ముందు అంటే పదిహేడేళ్ల క్రితమే ఈ టాటూ వేసుకున్నాను.. ఇప్పుడు వేసుకుంది కాదు. అయినా టాటూ వేసుకున్నంత మాత్రాన క్యారక్టర్ బ్యాడ్ అయిపోదు ” అని గట్టిగానే బదులిచ్చింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















