వైరలవుతున్న ప్రగ్యా లేటెస్ట్ పిక్స్..!

‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఈ చిత్రం విడుదలైనట్టు కూడా ఎవరికీ తెలీదంటే ఆ చిత్రం ఎంత ప్లాపయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రగ్యా కు కూడా ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘కంచె’ చిత్రం మాత్రం ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో చాలా సంప్రదాయంగా కనిపించడం వలన సరైన అవకాశాలు రాలేదనుకుందేమో ఇక తన తరువాతి చిత్రాలకి ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది.

‘ఓం నమో వెంకటేశాయ’ ‘గుంటూరోడు’ ‘నక్షత్రం’ ‘జయ జానకి నాయక’ ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి చిత్రాల్లో ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది. అయినప్పటికీ ఆమెకు ఆశించిన ఆఫర్లు మాత్రం రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యమ యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో మంచి బిజీబిజీగా గడుపుతుంది ఈ భామ. తన విదేశీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన రకరకాల ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసి ఆసక్తికర క్యాప్షన్స్ పెట్టింది. ఓ ఫోటోలో సూర్యుడు అస్తమిస్తున్న వేళ సాగరంలో జలకాలాడుతూ.. రెండు చేతి వేళ్లను కలిపి లవ్ సింబల్ ని ఆవిష్కరించింది. వేరొక ఫోటోలో బీచ్ లో తాపీగా నడిచి వెళుతూ వెనక్కి తిరిగి చూస్తుంది.

ఇక ఈ ఫోటోలలోతన తై షోస్ తో కుర్రకారుని రెచ్చగొడుతుంది. మొన్నటి వరకూ ప్రగ్యా ఓ యువ హీరోతో లవ్ లో ఉందని.. ఆ తరువాత ఓ యంగ్ డైరెక్టర్ తో లవ్ లో ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అటువంటిది ఏమీ లేదని ప్రగ్యా సన్నిహిత వర్గం క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus