షో లోకి వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇవ్వనున్న ప్రగ్యా జైస్వాల్‌!

  • June 19, 2018 / 06:34 AM IST

ఈసారి ఇంకొంచెం మసాలా.. అంటూ నాని ఊరించిన బిగ్ బాస్ సీజన్ 2 .. బుల్లితెర ప్రేక్షకులకు కిక్ ఇవ్వలేకపోతోంది. కొంతమంది హోస్ట్ నాని బాగా చేయడం లేదని విమర్శిస్తుంటే.. మరికొంతమంది మాత్రం పార్టిసిపెంట్స్ బాగాలేరని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా వందరోజుల పాటు ఉత్కంఠత కలిగించాల్సిన ఈ షో మొదట్లోనే తుస్ అనడంతో షో నిర్వాహకులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే మొదటగా కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన మోడల్ సంజన ని బయటికి పంపించి.. నటి నందిని ని లోపలి రప్పించారు. ఇంతేకాదు వచ్చే కొన్ని వారాల్లో మరికొంతమందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నట్లు తెలిసింది.  ముందుగా కంచె, నక్షత్రం వంటి సినిమాలతో అభిమానులను సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్‌ ని షోలోకి తీసుకురానున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఈమె సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిరంజీవికి మూడో భార్యగా నటిస్తోంది. ఇది చాలా చిన్న రోల్. తన పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. డబ్బింగ్ కి ఈమె అవసరం లేదు. సాయి ధరమ్ తో మళ్ళీ ఓ సినిమాకి సైన్  చేసింది. ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మరింత సమయం పడుతుంది. ఇవి తప్ప ఆమె చేతిలో ఏ ప్రాజక్ట్ లేదు. అంతేకాకుండా నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పడంతో ప్రగ్యా ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఈ బ్యూటీ ఎంతమేర షోకి ప్లస్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus