Pranavi: కిరాక్ స్టెప్పులేసిన ప్రణవి మానుకొండ.. వీడియో వైరల్..!

సోషల్ మీడియాలో పాపులర్ హీరోయిన్లతో పాటు అప్‌కమింగ్ ఆర్టిస్టుల హంగామా కూడా మూములుగా ఉండదు.. అందులోనూ చైల్డ్ ఆర్టిస్టుగా అదరగొట్టేసి.. బిగ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్న ప్రణవి మానుకొండ సందడే వేరు.. 8 సంవత్సరాల వయసులో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రణవి తక్కువ టైంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలనటిగా 50కి పైగా సినిమాల్లో నటించి.. ‘ఉయ్యాల జంపాల’ మూవీకి గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డ్ అందుకుంది.. ప్రణవి మానుకొండ చేసే డబ్‌స్మాష్, టిక్ టాక్ వీడియోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి..

ఎప్పటికప్పుడు లేటెస్ట్ రీల్స్, ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది.. మహానటి సావిత్రిని స్ఫూర్తిగా తీసుకుని మంచి నటి అవాలనేది తన డ్రీమ్.. రీసెంట్‌గా ‘గుండెల్లోనా’ (ఓరిదేవుడా) సాంగ్‌కి శారీతో ప్రణవి చేసిన డ్యాన్స్ వీడియో అయితే బాగా వైరల్ అవుతోంది. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌‌తో కుర్రకారుని కట్టిపడేస్తూ.. చాలా అందంగా పర్ఫార్మ్ చేసింది.. ప్రణవి లేటెస్ట్ పిక్స్, వీడియోస్ ఆకట్టుకుంటున్నాయి.. త్వరలోనే బిగ్ స్క్రీన్ మీద మెరవనుందీ ముద్దుగుమ్మ..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus