ఈ లాక్ డౌన్ టైములో విలన్ సోనూ సూద్ నిజమైన హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే.ఇక హీరోయిన్లలో ప్రణీత సుభాష్ కూడా తన గొప్ప మనసు చాటుకుని నిజమైన హీరోయిన్ అనిపించుకుంది. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల పేద సినీ కార్మికులకు పూట గడవలేని పరిస్థితి ఏర్పడితే.. వాళ్ళను ఆడుకుంది ప్రణీత. హీరోయిన్లలో మొదట సాయం చెయ్యడానికి వచ్చింది ప్రణీతనే. అక్కడితో ఆగలేదు.. తిండి లేక అలమటిస్తున్న పేద వారి ఆకలి కూడా తీర్చింది.
స్వయంగా తనే వంట చేసి.. ఎంతో మందికి అన్నం పెట్టింది. ఇందుకు గాను రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో పాటు సోషల్ మీడియాలోని ఆమె ఫాలోవర్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ మాల్దీవుల్లో మెరిసింది. వెకేషన్ నిమిత్తం ఈమె మాల్దీవులకు వెళ్లినట్టు స్పష్టమవుతుంది.’వైట్ అండ్ బ్లూ బీచ్ వేర్’ లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని నవ్వుతూ నడిచి వస్తున్న ప్రణీత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కేవలం ఆ ఫోటో మాత్రమే కాదు,ప్రణీతకు సంబంధించి ఇంకా చాలా ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వరుసగా మన టాలీవుడ్ హీరోయిన్లు మాల్దీవుల్లో సందడి చెయ్యడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పటికే కాజల్ హనీమూన్ నిమిత్తం తన భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. ఇక రకుల్ కూడా హాలిడే ట్రిప్ కోసం అక్కడికే వెళ్ళింది. ఇప్పుడు బాపు గారి బొమ్మ ప్రణీత కూడా అక్కడే మెరవడం విశేషం.